సంక్రాంతి రేస్ నుంచి వెనక్కి వెళ్ళిన ‘సర్దార్’

సంక్రాంతి రేస్ నుంచి వెనక్కి వెళ్ళిన ‘సర్దార్’

Published on Oct 2, 2015 3:45 AM IST

Sardaar-Gabba-Singh
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’. పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ మరోసారి అదే యాటిట్యూడ్ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో మరోసారి కనిపించనున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఓ సెట్ లో హాట్ బ్యూటీ లక్ష్మీ రాయ్ – పవన్ కళ్యాణ్ లపై ఓ స్పెషల్ ఐటమ్ సాంగ్ ని షూట్ చేస్తున్నారు. ‘కెవ్వు కేక’ సాంగ్ ని మించి ఉండేలా దేవీశ్రీ ప్రసాద్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రారంభించిన రోజునే ఈ సినిమాని 2016 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నామని ఈ చిత్ర ప్రొడక్షన్ టీం అనౌన్స్ చేసింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమ సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుందని సమాచారం. దానికి కారణం షూటింగ్ విషయంలో అనుకున్నదానికంటే ఎక్కువగా జాప్యం జరుగుతూ ఉండడం. ఇటీవలే సినిమాటోగ్రాఫర్ జయనన్ విన్సెంట్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో సినిమా షూటింగ్ మళ్ళీ బ్రేక్ ఇచ్చారు. దాంతో సినిమా అనుకున్న టైంకి పూర్తయ్యే ఛాన్స్ కనిపించకపోవడంతో 2016 సమ్మర్ కానుకగా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి బాబీ డైరెక్టర్. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు