యంగ్ స్టైలిష్ బిజినెస్ మెన్ గా ఎన్టీఆర్..?

యంగ్ స్టైలిష్ బిజినెస్ మెన్ గా ఎన్టీఆర్..?

Published on Apr 24, 2020 8:29 AM IST

ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో మూవీ ప్రకటించినప్పటి నుండి ఈ మూవీ కథపై అనేక పుకార్లు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. త్రివిక్రమ్ ఎప్పటిలాగే తన మార్కు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా తెరకెక్కించనున్నారని కొందరు అంటుంటే, ఈ సారి త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ఓ పొలిటికల్ థ్రిల్లర్ ట్రై చేయనున్నారని కొందరు అంటున్నారు. ఐతే తాజాగా ఈ మూవీపై మరో ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ఈ మూవీలో ఎన్టీఆర్ ని త్రివిక్రమ్ యంగ్ అండ్ స్టైలిష్ కార్పొరేట్ దిగ్గజంగా చూపించనున్నాడని టాక్. బిసినెస్ వరల్డ్ లో సక్సెస్ ఫుల్ యంగ్ ఎంట్రప్రెన్యూర్ గా ఎన్టీఆర్ లుక్ ఆటిట్యూడ్ ఓ రేంజ్ లో ఉంటాయని తెలుస్తుంది. మరి ఇదే కనుక నిజం అయితే ఎన్టీఆర్ ని గతంలో చూడని ఓ కొత్త అవతారంలో చూడవచ్చు.

ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం కోసం ఓ బాలీవుడ్ హీరోయిన్ ని వెతికే పనిలో త్రివిక్రమ్ ఉన్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ మూవీ విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు