క్రేజీ కాంబినేషన్ లో వెంకీ మూవీ?

Published on Jul 1, 2020 9:12 pm IST

రాఘవేంద్ర రావు మరియు వెంకటేష్ కాంబినేషన్ లో అనేక సినిమాలు వచ్చాయి. వెంకటేష్ డెబ్యూ మూవీ కలియుగ పాండవులు కూడా రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో వచ్చినదే.కూలీ నంబర్ వన్, సుందరకాండ వంటి హిట్ చిత్రాలు వీరి కాంబినేషన్ లో తెరకెక్కినవే. వీరు చివరిసారిగా 2005లో వచ్చిన సుభాష్ చంద్రబోస్ కోసం కలిసిపనిచేశారు. ఐతే వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ రానుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం లేదు.

ప్రస్తుతం వెంకటేష్ తమిళ్ హిట్ మూవీ అసురన్ తెలుగు రీమేక్ నారప్ప మొవేయిలో నటిస్తున్నారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రియమణి హీరోయిన్ గా నటిస్తుంది. 50 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీలో వెంకటేష్ మధ్య వయస్కుడి పాత్ర చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More