ప్రభాస్ – నీల్ కాంబోపై ఆగని క్రేజీ గాసిప్స్.!

ప్రభాస్ – నీల్ కాంబోపై ఆగని క్రేజీ గాసిప్స్.!

Published on Dec 1, 2020 1:02 PM IST

ఇప్పుడు పాన్ ఇండియన్ వైడ్ ప్రేక్షకులు అంతా ప్రభాస్ అండ్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పై ఫిక్సయ్యిపోయారు. భారీ చిత్రం కేజీయఫ్ నిర్మాణ సంస్థ హోంబేల్ ఫిల్మ్స్ వారు అనౌన్స్ చేసిన ఓ అప్డేట్ కోసమే అంతా రసవత్తరంగా చర్చ నడుస్తుంది. నిజానికి ప్రభ మరియు ప్రశాంత్ నీల్ కాంబోపై ఎప్పటి నుంచో టాక్ నడుస్తుంది.

దీనితో ఈ భారీ చిత్రం ఎప్పుడు వస్తుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూడడం మొదలు పెట్టారు. కానీ ఇటీవలే మేకర్స్ ప్రకటనతో ఇక ఈ పాన్ ఇండియన్ ఫిల్మ్ ముమ్మాటికీ ప్రభాస్ అండ్ నీల్ సినిమానే అని ఫిక్సయ్యిపోయారు. దీనితో ఈ అధికారిక ప్రకటన కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే మరి ఆ సినిమా కోసం ఎలాంటి అప్డేట్ వస్తుంది అన్న దానిపైనా గాసిప్స్ మాత్రం ఆగడం లేదు. వీటిలో ఒకటి వీరి చిత్రం టైటిల్ ను రివీల్ చేస్తారని కూడా వినిపిస్తుంది. అసలు ముందు సినిమా ఉందా లేదా అన్నది పక్కన పెడితే టైటిల్ పై కూడా గాసిప్స్ వచ్చేసాయి. మరి నిజంగానే ఈ సాలిడ్ కాంబో సెట్టయ్యిందా లేదా అన్నది తెలియాలి అంటే ఇంకొన్ని గంటలు ఓపిక పట్టక తప్పదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు