‘రౌడీ జనార్దన’ కోసం సీనియర్ హీరోయిన్ ?

‘రౌడీ జనార్దన’ కోసం సీనియర్ హీరోయిన్ ?

Published on Feb 1, 2026 10:00 AM IST

Rowdy Janardhana

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రవి కిరణ్‌ కోలా తెరకెక్కిస్తున్న సినిమా ‘రౌడీ జనార్దన’(Rowdy Janardhana). ఐతే, ఇప్పుడు ఈ సినిమా పై ఓ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ శోభన నటించనున్నట్లు తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ లో ఆమె హీరోకి తల్లి పాత్రలో కనిపిస్తోందట. మరి ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో చూడాలి. మొత్తానికి ఈ సినిమాకు సంబంధించి లీకుల రూపంలో చాలా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.

కాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్‌ హీరో రాజశేఖర్‌ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అన్నట్టు రాజశేఖర్ పాత్ర అండ్ ఆయన లుక్ మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుందట. ఇప్పటికే, లుక్‌ టెస్ట్‌ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్‌ నటించనుంది. మొత్తానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు