వైష్ణవ్ తేజ్ సినిమాకి క్రేజీ ఆఫర్ !

Published on Aug 1, 2021 10:02 pm IST

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా దర్శక-నిర్మాత క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొండపొలం అనే నవల ఆధారంగా ఈ సినిమా రాబోతుంది. పైగా ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె పాత్ర చాలా కొత్తగా ఉంటుందట. పైగా ఇదొక వైవిధ్యమైన సినిమా అట. పైగా అటవీ ప్రాంతంలో ఈ సినిమా నేపథ్యం సాగనుంది.

అయితే తాజాగా ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయిందని, సినిమా చాలా బాగా వచ్చిందని తెలుస్తోంది. ఉప్పెనతో మంచి క్రేజ్ తెచ్చుకున్న వైష్ణవ్ తేజ్, ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కడం ఖాయం అంటున్నారు సినిమా యూనిట్. ఇక ఈ సినిమాని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయమని.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ నుండి భారీ ఆఫర్ వచ్చినా మేకర్స్ ఈ సినిమా థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :