యూఎస్ లో క్రేజీ రెస్పాన్స్ తో “వీరసింహా రెడ్డి”.!

veera 3
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అవైటెడ్ మాస్ చిత్రం “వీరసింహా రెడ్డి”. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం అయితే రిలీజ్ కి దగ్గర అవుతుండగా యూఎస్ మార్కెట్ లో అయితే ఈ చిత్రం మాసివ్ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది. మరి లేటెస్ట్ గా అయితే ఈ చిత్రం అక్కడ ఏకంగా 4 లక్షల డాలర్స్ మార్క్ ని దాటేసింది.

ఇది జస్ట్ ప్రీమియర్స్ తోనే కాగా ఇక డే 1 నాటికి అయితే మరింత భారీ నంబర్స్ నమోదు అయ్యే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాల వారు చెప్తున్నారు. దీనితో వీరసింహా రెడ్డి క్రేజ్ మాత్రం యూఎస్ లో నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ తదితరులు నటించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన ఈ చిత్రం ఈ జనవరి 12న అత్యంత ఘనంగా విడుదల కాబోతుంది.

Exit mobile version