ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన క్రేజీ రైడ్ “ఓం భీం బుష్”

ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన క్రేజీ రైడ్ “ఓం భీం బుష్”

Published on Apr 12, 2024 7:03 AM IST


ఈ ఏడాదిలో టాలీవుడ్ నుంచి వచ్చిన క్రేజీ హిట్ చిత్రాల్లో హిట్ ట్రయో శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ అలాగే ప్రియదర్శి కాంబినేషన్ లో దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి తెరకెక్కించిన కామెడీ హారర్ డ్రామా “ఓం భీం బుష్” కూడా ఒకటి. మరి ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ నడుమ వచ్చిన ఈ చిత్రం శ్రీ విష్ణు కెరీర్ లో మరో సాలిడ్ హిట్ గా అయితే నిలిచింది. ఇక ఈ చిత్రం మరి ఫైనల్ గా ఓటీటీ ఎంట్రీ ఇచ్చేసింది.

ఈ సినిమా హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మరి ఈరోజు నుంచి ఈ చిత్రం అందులో అందుబాటులో కి వచ్చేసింది. మరి అప్పుడు మిస్ అయ్యి ఇప్పుడు చూడాలి అనుకునేవారు తప్పకుండా ఈ సినిమాని ఓటీటీ లో ట్రై చేయవచ్చు. ఇక ఈ చిత్రంలో అయేషా ఖాన్ తదితరులు నటించగా సన్నీ ఎం ఆర్ సంగీతం అందించారు అలాగే వి సెల్యులాయిడ్ వారు నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు