అదే నిజమైతే బన్నీ కెరీర్ లో ఫస్ట్ టైం అవుతుంది

Published on Feb 23, 2020 12:45 pm IST

నేడు అల్లు అర్జున్, సుకుమార్ ల మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. దాని ప్రకారం ఈ చిత్రంలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేయనున్నారట. ఓ పాత్రలో బన్నీ ఉంగరాల జుట్టు, మాసిన గడ్డం తో మాస్ అండ్ డీగ్లామర్ లుక్ లో లారీ డ్రైవర్ గా నటిస్తుండగా మరో పాత్రలో అతను క్లాస్సి బిజినెస్ మెన్ లా కనిపిస్తాడట. ఈ రూమర్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో కాక రేపుతోంది. ఇదే కనుక నిజం అయితే బన్నీ మొదటిసారి డ్యూయల్ రోల్ చేసిన సినిమాగా మిగిలిపోతుంది. ఇప్పటివరకు 19సినిమాలో నటించినా, బన్నీ ఒక్క సినిమాలోకి కూడా డ్యూయల్ రోల్ చేయలేదు.

కాగా ఈ చిత్ర సెకండ్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీకి సంగీతం దేవిశ్రీ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :