రామ్ సినిమాకి క్రేజీ టైటిల్ !
Published on Jul 30, 2017 10:06 am IST


‘హైపర్’ సినిమా తర్వాత హీరో రామ్ కొంచెం గ్యాప్ తీసుకుని తన 15వ సినిమాను చేస్తున్నాడు. ‘నేను శైలజ’ సినిమాతో రామ్ కు మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు కిశోర్ తిరుమల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మధ్యే వైజాగ్, హైదరాబాద్ షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఆగష్టు నుండి ఊటీ షెడ్యూల్ కు వెళ్లనుంది.

ఇకపోతే ఈ చిత్రానికి ‘ఉన్నది ఒకటే జిందగీ’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. త్వరలొనే ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. రామ్ పూర్తిగా స్టైలిష్ లుక్ తో కనిపిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, మేఘా ఆకాష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ నిర్మాత స్రవంతి రవి కిశోర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదలచేసే అవకాశాలున్నాయి.

 
Like us on Facebook