విభిన్నమైన చిత్రాలతో బాలీవుడ్ లో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సోనాక్షి సిన్హా ప్రస్తుతం తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. హీరో సుధీర్ బాబు కెరీర్‌లో భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతున్న ‘జటాధర’ చిత్రంలో ఆమె ఓ కీలక పాత్రలో నటించబోతున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా సోనాక్షి సిన్హా మరో తెలుగు సినిమాలో కూడా నటించబోతునట్లు తెలుస్తోంది. న్యాచురల్ స్టార్ నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘దసరా’ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించారు. ఇక తన నెక్స్ట్ చిత్రాన్ని కూడా నానితో స్టార్ట్ చేశాడు ఈ యంగ్ డైరెక్టర్. ‘ది ప్యారడైజ్’ అనే టైటిల్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు.
అయితే, ‘ది పారడైజ్’లో ఓ కీలక పాత్ర కోసం సోనాక్షి సిన్హాను అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. సోనాక్షి సిన్హా కూడా ఈ సినిమాలో నటించడానికి అంగీకరించిందట. అన్నట్టు ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా పై ఓ స్పెషల్ సాంగ్ ను కూడా షూట్ చేస్తారట. పక్కా యాక్షన్ ఎలిమెంట్స్ తో రాబోతున్న ఈ సినిమాలో మాస్ కి ఫుల్ మీల్స్ లా ఉంటుందట సినిమా. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటించే కథానాయికను ఇంకా ప్రకటించలేదు. కాగా ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.