అసలు విలన్ “ఎవరు”?

Published on Aug 6, 2019 12:08 am IST

నిన్న విడుదలైన ఎవరు మూవీ ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఓ సస్పెన్సు థ్రిల్లర్ మూవీకి కావలసిన ఎలిమెంట్స్ అన్ని “ఎవరు” మూవీలో ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. మర్డర్ కేసు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా హీరో అడవి శేషు, అనుకోని సంఘటనతో హత్య కేసులో ఇరుకున్న అమ్మాయిగా రెజీనా కాసాండ్రాల నటన ట్రైలర్ లో హైలెట్ గా ఉంది.

ఐతే “ఎవరు” మూవీ ఓ మర్డర్ చుట్టూ తిరిగే క్రైమ్ థ్రిల్లర్ అని అర్థం అవుతుంది. ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ ట్రైలర్లో అడివి శేషు పాత్ర ఓ కరెప్టెడ్ పోలీస్ ఆఫీసర్ గా చూపించబడింది. స్టేషన్ కు న్యాయం కోసం వచ్చే బాధితుల దగ్గర లంచాలు వసూలు చేసే అవినీతి పోలీస్ గా కనిపిస్తున్నాడు. అలాగే రెజీనా క్యారెక్టర్ కూడా అనుమానాస్పదంగా ఉంది.ఒక వ్యక్తి నిజంగా తనను మానభంగం చేయడానికి ప్రయత్నించాడని అతనిని చంపిందా? లేక వ్యక్తిగత కక్షతో చంపిందా? అనేది తెలియాల్సివుంది. అలాగే ఈ మూవీలో మరో కీలక క్యారెక్టర్ నవీన్ చంద్ర రోల్ ఏమిటనేది ఆసక్తికరం.

ఇలా చిత్రంలోని ప్రధాన పాత్రలైన అడవి శేషు,రెజీనా,నవీన్ చంద్రలలో అసలు విలన్ ఎవరు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. పరమ్ వి పొట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వెంకట్ రాంజీ రూపొందిస్తున్నాడు. ఆగస్టు 15న విడుదల కానుంది .

సంబంధిత సమాచారం :