రైల్వే స్టేషన్లో పవన్ కళ్యాణ్ గొడవ !
Published on Nov 26, 2016 4:21 pm IST

katamarayudu
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘కాటమరాయుడు’. దర్శకుడు డాలి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. పవన్ కళ్యాణ్ కూడా వేరే సినిమా పనులు పెట్టుకోకుండా ఈ ప్రాజెక్ట్ పైనే దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఈ షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అక్కడ రూపొందించిన ప్రత్యేకమైన రైల్వే స్టేషన్ సెట్టింగ్లో భారీ ఫైటింగ్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు.

ప్రముఖ స్టంట్ కోరియేగ్రాఫర్లు రామ్-లక్ష్మణ్ లు ఈ పోరాట సన్నివేశాన్ని కంపోజ్ చేస్తున్నారు. సినిమాలో కీలక సమయంలో వచ్చే ఈ ఫైట్ లో పవన్ తో పాటు శృతి హాసన్ కూడా కనిపిస్తుందట. ప్రముఖ నిర్మాత శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రం పూర్తిగా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనుంది. తమిళంలో అజిత్ నటించిన ‘వీరమ్’ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ చిత్రం 2017 విడుదలయ్యే అవకాశముంది.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook