ఇంధనం ఇంజిన్ లేని “సైకిల్” చెప్పే ప్రేమకథ

Published on Jul 10, 2019 4:25 pm IST

పున‌ర్ణ‌వి భూపాలం, మ‌హ‌త్ రాఘ‌వేంద్ర శ్వేతావ‌ర్మ‌,సూర్య లీడ్‌రోల్స్‌లో ఆట్ల అర్జున్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం “సైకిల్”. పి.రాంమాధవ్,డి. నవీన్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.ఈ చిత్రం డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు కూడా పూర్తి చేసుకొని త్వరలో విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న దర్శకుడు అర్జున్ రెడ్డి మూవీ విశేషాలు చెప్పడం జరిగింది.

ఇంధనం,ఇంజిన్ లేకుండా మన జీవన ప్రయాణంలో భాగమైన సైకిల్ నే ప్రధాన కథాంశంగా తీసుకొని, మంచి హాస్యం జోడించి కొత్తగా తీయడం జరిగింది. ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ,హాస్యపూర్తితంగా చెప్పడం జరిగింది. సినిమాలో హీరో హీరోయిన్ల పాత్రలతో పాటు,కమెడియన్ సుదర్శన్ ,అనితా చౌదరి పాత్రలు బాగా నవ్విస్తాయి అన్నారు.

అన్న‌పూర్ణ‌మ్మ, జోగీబ్ర‌ద‌ర్స్ ,సూర్య‌, మ‌ధుమ‌ణి న‌వీన్‌నేని, ఆర్ఎక్స్‌100 ల‌క్ష్మ‌ణ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా,సంగీతం జి.ఎం.స‌తీష్‌ అందిస్తున్నారు. త్వ‌ర‌లో టీజ‌ర్‌తోపాటు, ఆడియోరిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం :

X
More