‘దబాంగ్ 3’ విడుదలకు ముహూర్తం ఖరారు !

Published on Sep 12, 2018 9:04 am IST

బాలీవుడ్ సూపర్ సస్టార్ సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా జంటగా అభినవ్ కశ్యప్ తెరకెక్కించిన చిత్రం ‘దబాంగ్ ‘. 2010లో ప్రేక్షకులముందుకు వఛ్చిన ఈ చిత్రం బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన ‘దబాంగ్2’ కూడా మంచివిజయాన్ని సాధించింది. దాంతో ఈ సిరీస్ లో వస్తున్న మూడవ సీక్వెల్ ఫై అంచనాలు పెరిగాయి. సల్మాన్ , సోనాక్షి జోడి నటించనున్నఈ ‘దబాంగ్ 3′ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించే అవకాశాలు వున్నాయి. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. ఈచిత్రం వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా ప్రేక్షుకులముందుకు రానుంది.

ఇక ఈ చిత్రం ఒక పోలీస్ ఆఫీసర్ నిజ జీవిత కథ తో తెరకెక్కనుందట. ఈ చిత్రం యొక్క షూటింగ్ మొత్తం దాదాపు ఘజియాబాద్ లో జరుగనుందని సమాచారం. ఇక ప్రస్తుతం సల్మాన్ నటిస్తున్న’భారత్’ వచ్చే ఏడాది ఈద్ కానుకగా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :