దబాంగ్ 2 కు ఒక్క రోజు ముందు దబాంగ్ 3 !

దబాంగ్ 2 కు ఒక్క రోజు ముందు దబాంగ్ 3 !

Published on Apr 27, 2019 9:51 AM IST

బ్లాక్ బ్లాస్టర్ మూవీ దబాంగ్ కు సీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం దబాంగ్ 2. ఈ చిత్రం 2012లో డిసెంబర్ 21న విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ సిరీస్ కు కొనసాగింపుగా తెరకెక్కుతున్న చిత్రం దబాంగ్ 3. సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న ఈ చిత్రం ఇటీవలే మొదటి షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది.

ఇక ఈ చిత్రం దబాంగ్ 2 కంటే సరిగ్గా ఒక్క రోజు ముందు ఈఏడాది డిసెంబర్ 21న విడుదలకానుంది. ప్రభుదేవా డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుధీప్ విలన్ పాత్రలో నటింస్తుండగా సల్మాన్ కు జోడీగా సోనాక్షి సిన్హా నటిస్తుంది. ఇక వీరితో పాటు ప్రముఖ తెలుగు కమెడియన్ అలీ కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు