దాదాపు 20 ఏళ్ళ తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ మల్టీ స్టారర్ సినిమాలు ఊపందుకున్నాయి. అందులోనూ ఒకే ఫ్యామిలీ లో ఎక్కువ హీరోలు ఉండడం వల్ల వాళ్ళ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమాలను అభిమానులు ఆశిస్తున్నారు. ఆ అభిమానుల కోరిక మేరకు అక్కినేని ఫ్యామిలీ హీరోలంతా కలిసి నటించిన సినిమా ‘మనం’ గత సంవత్సరం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. వీరి బాటలోనే దగ్గుబాటి రామానాయుడు ఫ్యామిలీ కూడా వాళ్ళ ఫ్యామిలీ హీరోస్ అంటా కలిసి ఓ సినిమా చేయాలనుకున్నారు. కానీ అనుకోకుండా రామానాయుడు గారు స్వర్గస్తులయ్యారు.
ఆయన కలని నెరవేర్చాలని దగ్గుబాటి ఫ్యామిలీ మాత్రం మల్టీ స్టారర్ సినిమాకి రంగం సిద్దం చేసుకుంటోంది. ఈ విషయాన్నీ స్వయంగా రానా తెలియజేసారు. ‘ఈ సంవత్సరం నేను బాబాయ్ తో కలిసి ఓ సినిమా చేస్తాను. ఆ సినిమా ఈ సంవత్సరం చివర్లో మొదలవుతుందని’ అన్నాడు. దగ్గుబాటి హీరోలైన వెంకటేష్, రానా కలిసి నటించనున్న ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య కూడా కలిసి నటించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్న ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ పై నిర్మించనున్నారు. ఈ మూవీకి ఎవరు దర్శకత్వం వహించబోతున్నారు అన్నది తెలియాల్సి ఉంది. సో ఫ్రెండ్స్ గెట్ రెడీ ఫర్ దగ్గుబాటి మల్టీ స్టారర్ మూవీ..


