దంగల్ డైరెక్టర్ ప్రశంసలందుకున్న “ఏజెంట్ సాయి శ్రీనివాస్”

Published on Jun 9, 2019 4:19 pm IST

దంగల్ డైరెక్టర్ నితీష్ తివారి తెలుగు మూవీ “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” మూవీ ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సంధర్బంగా హైదరాబాద్ వచ్చిన ఈ బాలీవుడ్ డైరెక్టర్ ఈ మూవీ ని ప్రోమోట్ చేస్తూ ఓ వీడియో చేశారు. ఈ మూవీలో ఆయన హీరో నవీన్ పోలిశెట్టి పై ప్రశంసల వర్షం కురిపించారు. నవీన్ పోలిశెట్టి కి తనకు ఓ కామన్ పాయింట్ ఉంది అన్నారు. మేమిద్దరం ఇంజనీరింగ్ చేశాం,అలాగే హీరో కావలననుకున్నందుకు తాను, డైరెక్టర్ కావలననుకున్నందుకు నేను ఫాథర్స్ చేత తిట్లు తిన్నాము అన్నారు.

నవీన్ పై ప్రేమతో కాదు, సినిమాపై ప్రేమతో చెవుతున్నాను, నవీన్ ఓ మంచి నటుడు,అందుకే నా నెక్స్ట్ మూవీ ,చ్చిచోరే’ లో తనకు ఓ పాత్ర ఇచ్చాను అన్నారు. “ఏజెంట్ సాయి శ్రీనివాస” ట్రైలర్ చూసాను, కామెడీ తో పాటు సీరియస్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న మంచి మూవీ అన్నారు. విజువల్స్ బాగాఉన్నాయి కచ్చితంగా విజయం సాదిస్తుందని అన్నారు. శృతి శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి స్వరూప్ దర్శకతం వహించగా, రాహుల్ నక్కా నిర్మించారు.

సంబంధిత సమాచారం :

More