సూపర్ స్టార్ రజిని కోసం మహేష్ బాబు దిగాడు

సూపర్ స్టార్ రజిని కోసం మహేష్ బాబు దిగాడు

Published on Nov 7, 2019 9:29 AM IST

Rajinikanth Mahesh

ఇండియన్ సూపర్ స్టార్ రజిని తాజా చిత్రం దర్బార్. స్టార్ డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. కాగా ఈ మూవీ ప్రమోషనల్ కార్యక్రమాలపై చిత్ర యూనిట్ ద్రుష్టి సారించింది. దానిలో భాగంగా నేడు దర్బార్ మూవీ మోషన్ పోస్టర్ విడుదల చేయనున్నారు. ఐతే తెలుగు దర్బార్ మోషన్ పోస్టర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయనున్నారు. నేటి సాయంత్రం 5:30 గంటలకు మహేష్ దర్బార్ మూవీ మోషన్ పోస్టర్ విడుదల చేస్తారు. ఈ మేరకు చిత్ర యూనిట్ అనౌన్స్మెంట్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది.

తమిళ దర్బార్ మోషన్ పోస్టర్ ని లోకనాయకుడు కమల్ హాసన్ విడుదల చేస్తున్నారు. దర్బార్ మూవీలో రజిని కాంత్ కి హీరోయిన్ గా నయనతార నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరూ మూవీ పాటల చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ రెండు చిత్రాలు సంక్రాంతికి పోటీపడనుండటం విశేషం.

Darbar Motion Poster

తాజా వార్తలు