అలా జరిగితే రజనీ ‘దర్బార్’కు సోలో రిలీజ్ ఇచ్చేసినట్టే

Published on Oct 14, 2019 8:52 pm IST

2020 సంక్రాంతికి సినిమాల పోటీ తీవ్రంగా ఉండనుంది. గతంలో అనేకసార్లు స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతికి విడుదలైనా కనీసం ఒకరోజైనా గ్యాప్ చూసుకుని వచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురములో’ జనవరి 12న వస్తుండగా మహేష్ బాబు యొక్క ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా 12నాడే విడుదలకానుంది. దీంతో ఓపెనింగ్స్ పరంగా భారీ క్లాష్ ఖాయం.

ఈ పరిస్థితి రజనీకాంత్ ‘దర్బార్’కు కలిసొచ్చేలా ఉంది. ముందుగా ఈ చిత్రాన్ని తమిళం, తెలుగులో జనవరి 15న విడుదలచేయాలని నిశ్చయించారు. కానీ ఇప్పుడు ఆ తేదీ ముందుకు జరిగి 10వ తేదీకి మారవచ్చనే వార్తలు వినబడుతున్నాయి. కానీ ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు.

ఒకవేళ ఇదే గనుక జరిగితే ఎలాగూ విడుదల చేసేది దిల్ రాజే కాబట్టి 10, 11 రెండు రోజులూ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో భారీగా థియేటర్లు దొరుకుతాయి. అప్పటికి వేరే పెద్ద సినిమా ఏదీ ఉండదు కాబట్టి ప్రేక్షకులు పెద్ద ఎత్తున చిత్రాన్ని ఆదరిస్తారు. ఫలితంగా రెండు రోజులు భారీ వసూళ్లు దక్కి ‘అల వైకుంఠపురములో, సరిలేర నీకెవ్వరు’ వచ్చేలోపే సినిమా సేఫ్ అయిపోతుంది.

సంబంధిత సమాచారం :

X
More