160 కోట్లు బాదిన సూపర్ స్టార్

Published on Jan 17, 2020 8:04 pm IST

ఎంత మంది హీరోలు వచ్చినా సూపర్ స్టార్ రజిని మేనియా ఇమేజ్ కొంచె కూడా తగ్గడంలేదు. ఆయన జస్ట్ స్క్రీన్ పై కనిపిస్తే చాలు వంద కోట్లు ఖాయం అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఆయన నటించిన సంక్రాంతి రిలీజ్ దర్బార్ రికార్డ్ కలెక్షన్స్ రాబడుతుంది. ఈనెల 9న విడుదలైన దర్బార్ ఇప్పటికే 160కోట్ల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రాబట్టినట్టు సమాచారం. దర్బార్ తెలుగు, తమిళ మరియు హిందీ భాషలలో విడుదల కాగా అన్ని భాషలలో కలిపి వరల్డ్ వైడ్ గా ఈ మొత్తం రాబట్టింది. నిజానికి తెలుగు మరియు హిందీ భాషలలో ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. రానున్న వారాంతపు సెలవుల్లో దర్బార్ వసూళ్లు మెరుగయ్యే అవకాశం కలదు.

టాలెంటెడ్ డైరెక్టర్ మురుగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ దర్బార్ చిత్రాన్ని నిర్మించింది. రజిని పోలీస్ అధికారి పాత్ర చేసిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించగా నివేదా థామస్ రజిని కూతురు పాత్ర చేయడం విశేషం. అనిరుధ్ దర్బార్ మూవీకి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :

X
More