రెండో రోజు సైతం దర్బార్ బాగానే రాబట్టింది

Published on Jan 11, 2020 10:00 pm IST

రజిని కాంత్ లేటెస్ట్ మూవీ దర్బార్ ఈనెల 9న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఎనర్జిటిక్ అండ్ బాడ్ పోలీస్ ఆఫీసర్ గా రజని నటనకు ఫ్యాన్స్ వెర్రెత్తిపోతున్నారు. కాగా తెలుగు రాష్ట్రాలలో దర్బార్ మొదటి రోజు 4.5 కోట్ల షేర్ రాబట్టి అబ్బురపరించింది. రెండవ రోజు సైతం దర్బార్ బాక్సాపీస్ వద్ద మంచిగానే పర్ఫార్మ్ చేసింది. రెండవ రోజు ఈ చిత్రం ఏపీ మరియు తెలంగాణాలలో కలిపి 1.7 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో రెండు రోజులకు గాను 6.2 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక అన్ని భాషలలో కలిపి దర్బార్ ఇప్పటికే 100కోట్ల గ్రాస్ దాటివేసినట్టు సమాచారం.

ఇక నేడు మహేష్ మూవీ సరిలేరు నీకెవ్వరు విడుదల కావడంతో దర్బార్ వసూళ్ళలో కొంత తగ్గుదల నమోదయ్యే అవకాశం కలదు. అలాగే రేపు మరో పెద్ద చిత్రం అల వైకుంఠపురంలో విడుదల అవుతుంది. ఐనప్పటికీ సంక్రాంతి పండుగ నేపథ్యం కావడంతో అన్ని సినిమాలకు మార్కెట్ ఉంటుంది.

సంబంధిత సమాచారం :