షూటింగ్ పూర్తి చేసుకున్న కామెడీ ఎంటర్టైనర్ “డార్లింగ్”

షూటింగ్ పూర్తి చేసుకున్న కామెడీ ఎంటర్టైనర్ “డార్లింగ్”

Published on May 10, 2024 7:00 PM IST


టాలీవుడ్ ప్రముఖ నటుడు, కమెడియన్ ప్రియదర్శి ప్రధాన పాత్రలో, నభా నటేష్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ డార్లింగ్. ఈ చిత్రం ను అనౌన్స్ చేసినప్పటి నుండి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. హనుమాన్‌ చిత్రాన్ని నిర్మించిన నిరంజన్‌రెడ్డి ఈ డార్లింగ్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అశ్విన్ రామ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం మళ్ళీ వార్తల్లో నిలిచింది.

ఈ చిత్రం కి సంబందించిన షూటింగ్ నేడు పూర్తి అయ్యింది. ఇదే విషయాన్ని మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం కి సంబందించిన ప్రమోషన్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి. అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా, హేమంత్ డైలాగ్ రైటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు