
ఇండస్ట్రీలో అతను సీనియర్ మోస్ట్ డైరెక్టర్ కానీ ప్రస్స్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న పలు విషయాలు మాత్రం ఆయన్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే ఆయన చిన్న సినిమాలు తీసే దర్శక నిర్మాతలవైపు నిలబడ్డాడు. అతనే దర్శకరత్న దాసరి నారాయణరావు.
తాజాగా దాసరి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకి 100 కోట్లు సాధించే సత్తా ఉందా? అని అడిగితే ‘ ముందు 100 రోజులు ఆడే సినిమాలు తీస్తే 100 కోట్లు వాటంతట అవే వస్తాయి. సినిమా బడ్జెట్ మీద కాకుండా కాస్ట్లీ కథల మీద దృష్టి పెట్టాలన్నారు’.
అలాగే టాప్ డైరెక్టర్స్ చిన్న సినిమాలు తీస్తే ఇండస్ట్రీకి మంచిదా? అనే ప్రశ్నకి సమాధానం ఇస్తూ ‘నా కెరీర్లో నేను మాత్రం చిన్న సినిమాలు చేసాను. ‘నీడ’ సినిమాని కేవలం లక్ష రూపాయిల్లోనే తీసాం. ఈ తరం దర్శకుల్లో రాజమౌళి ఒక్కడే వినూత్నంగా ఆలోచిస్తున్నాడు. తను తీసిన ‘మర్యాద రామన్న’ చిన్న సినిమానే. అలాగే రాజమౌళి, శేఖర్ కమ్ముల లాంటి వాళ్ళకి పెద్ద హీరోల జోలికి వెళ్ళకండి’ ఎని చెప్పాను. అదే పంథాలోనే వాళ్ళు సినిమాలు చేస్తున్నారని’ అన్నాడు.

