ఇంతకీ దాసరి కుమారుడు ప్రభు ఏమైనట్లు?

Published on Jun 14, 2019 8:52 am IST

నిన్నటి నుండి అన్ని మీడియా చానెల్స్ లో దర్శకరత్న దాసరి నారాయణ కుమారులలో ఒకరైన ప్రభు కనిపించకుండా పోయారని ప్రముఖంగా వినిపిస్తున్న వార్త. దీనిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు కూడా నమోదైందని సమాచారం. దీనితో ఎంక్వైరీ మొదలుపెట్టిన పోలీసులు ఆయన జాడ తెలుసుకుంటాం అని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చి పంపించారట.

ఐతే కేసు నమోదైన కొన్ని గంటల తరువాత ప్రభు చిత్తూరు లోని తన రెండవ భార్య ను కలవడానికి ఆయన వెళ్లారని మరొక వార్తలు కొన్ని మాధ్యమాలలో ప్రసారం చేయడం జరిగింది. కానీ నేటి ఉదయం కూడా ప్రభు మిస్సయినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన నిజంగా చిత్తూర్ లో ఉన్నారా లేదా? ఇంతకీ ఆయన ఆచూకీ దొరికిందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. నిన్నటి నుండి ఆయన మిస్సింగ్ మిస్టరీ కొనసాగుతూనే ఉంది. దాసరి కి ఇద్దరు కుమారులు కాగా వారిలో పెద్ద కొడుకు ప్రభు, చిన్న కుమారుడు అరుణ్.

సంబంధిత సమాచారం :

More