పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్న దాసరి ‘ఎర్రబస్సు’

పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్న దాసరి ‘ఎర్రబస్సు’

Published on Oct 21, 2014 1:17 PM IST

errabasuu
దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వం వహిస్తూ, ముఖ్య పాత్ర పోషిస్తున్న సినిమా ‘ఎర్రబస్సు’. మంచు విష్ణు హీరోగా కేథరిన్ ట్రేస హీరోయిన్ గా నటించిన సినిమా ‘ఎర్రబస్సు’. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ఇటీవలే ఈ సినిమాలో మిగిలి ఉన్న పాటల షూటింగ్ ని ఊటీలో ఫినిష్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. దాసరి నారాయణరావు ఈ సినిమాని చిల్డ్రన్స్ డే కానుకగా నవంబర్ 14న రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

‘ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో భాగమైన రీ రికార్డింగ్, ఎడిటింగ్ పనులుజరుగుతున్నాయి. ఈ చిత్రానికి నేనే నిర్మాతని కావడం వల్ల విడుదల సన్నాహాలు కూడా చేసుకుంటున్నాను. త్వరలోనే భారీగా ఎత్తున ప్రమోషన్స్ చేయనున్నామని’ దాసరి నారాయణరావు తెలిపారు. ఈ సినిమాలో దాసరి – మంచు విష్ణు తాత మనవళ్లుగా గా కనిపించనున్నారు. తమిళంలో హిట్ అయిన ‘మంజపై’ అనే సినిమాకి ఇది రీమేక్.

పల్లెటూరి నుండి మనవడి కోసం సిటీకి వచ్చిన తాత వల్ల మనవడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కున్నాడు అనే కధాంశంతో ఈ మూవీ రూపొందింది. బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, అలీ, కృష్ణుడు, రఘుబాబులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ మూవీకి చక్రి సంగీతం అందిస్తున్నాడు. ఈ నెలాఖరులో ‘ఎర్రబస్సు’ ఆడియోని రిలీజ్ చేయనున్నారు.

తాజా వార్తలు