
150కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి తెలుగు చలన చిత్ర చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని క్రియేట్ చేసుకున్న దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణరావు. ఈ మధ్య కాలంలో ఆయన సినిమాలు చేయడం తగ్గించినా ఇండస్ట్రీ పెద్దగా అన్ని విషయాల్లోనూ ముందు ఉండడమే కాకుండా చిన్న సినిమాలకు, చిన్న నిర్మాతలకు ఇప్పటికీ తన వంతు సహాయం చేస్తూనే ఉంటాడు. అంతే కాకుండా ఆయన ఈ మధ్య చాలా ఫంక్షన్స్ లో ప్రస్తుతం టాలీవుడ్ లో జరుగుతున్న మార్పులు సరిగాలేవని కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.
గతవారం రిలీజ్ అయిన రుద్రమదేవి సినిమా బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ కలెక్షన్స్ ని రాబట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర టీం ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ ప్రెస్ మీట్ కి ముఖ్య అతిధిగా విచ్చేసిన దాసరి కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. ‘రుద్రమదేవి లాంటి సినిమాలకి బాక్స్ ఆఫీసు వద్ద కాస్త సమయం కేటాయించాలి. ఈ వారం బాక్స్ ఆఫీసు వద్ద సందడి చేయడానికి వస్తున్నా పెద్ద సినిమాని వాయిదా వేస్తె రుద్రమదేవి కచ్చితంగా బాక్స్ ఆఫీసు వద్ద రికాద్ కలెక్షన్స్ ని నమోదు చేస్తుందని’ దాసరి అన్నారు.
దాంతో మొదట అందరి చూపు ఈ వారం రిలీజ్ కానున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమా మీదకి వెళ్ళింది. ఈ సినిమాని అనుకున్న టైంకి రిలీజ్ చెయ్యాలని రామ్ చరణ్ ఉండడంతో బ్రూస్ లీ టీం వెనక్కి పోయే ఛాన్స్ కనిపించడం లేదు. ఇది ఎలా ఉన్నా ఇప్పుడు బాక్స్ ఆఫీసు వద్ద ఒక సినిమాకి ఉన్న సమయం ఒకటి లేదా రెండు వారాలు. ఎంతటి సినిమా ఆననా ఆ టైంలో కలెక్షన్స్ సాధించుకొని వెళ్లిపోవాలి. కావున ఇక నుంచి అయిన యిలాంటి ఇబ్బందులు లేకుండా పెద్ద సినిమాలు రిలీజ్ డేట్స్ ని ప్లాన్ చేసుకుంటే బెటర్.

