
అక్కినేని యువ హీరో నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘లవ్ స్టోరీ’ అనేది ఈ సినిమా టైటిల్. గత ఏడాది ఆరంభంలో మొదలైన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. లాక్ డౌన్ అనంతరం ఇటీవలే రీస్టార్ట్ అయి చివరి దశ పనుల్లో ఉంది. సినిమా నుండి అప్డేట్ వచ్చి చాలాకాలం కావడంతో చిత్ర బృందం టీజర్ ప్లాన్ చేసింది.
ఈ టీజర్ జనవరి 10న 10 గంటల 8 నిముషాలకు రిలీజ్ కానుంది. ఉన్నట్టుండి వచ్చిన ఈ అప్డేట్ తో చైతూ అభిమానులు ఖుషీ అవుతున్నారు. నాగ చైతన్య గత చిత్రాలు ‘మజిలీ, వెంకీ మామ’ విజయాలను సాధించి ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ‘ఫిదా’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కాబట్టి వ్యాపార వర్గాల్లో కూడ హైప్ ఉంది. ఇందులో చైతూకు జోడీగా సాయి పల్లవి నటిస్తోంది. తమ కలల్ని నిజం చేసుకోవడం కోసం హైదరాబాద్ వచ్చిన యువతీయువకుల కథగా ఈ చిత్రం ఉండనుంది. నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

