‘కథానాయకుడు’ ఆడియో అండ్ ట్రైలర్ లాంచ్ డేట్ ఫిక్స్ !

‘కథానాయకుడు’ ఆడియో అండ్ ట్రైలర్ లాంచ్ డేట్ ఫిక్స్ !

Published on Dec 16, 2018 3:53 AM IST

క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా ఆయన బయోపిక్ పార్ట్స్ శరవేగంగా తెరకెక్కుతున్నాయి. కాగా మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ పోస్ట్ ప్రొడక్షన్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఇప్పటికే ముఖ్యమైన పాత్రలకు సంబధించి డబ్బింగ్ కూడా చాలా వరకు పూర్తి అయింది.

కాగా తాజాగా ‘కథానాయకుడు’ ఆడియో అండ్ ట్రైలర్ లాంచ్ డిసెంబర్ 21వ తేదీన అవుతుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ‘కథానాయకుడు’ నుండి విడుదలైన ‘కథానాయక’ మరియు రాజర్షి పాటలకు ప్రేక్షకుల్లో మంచి స్పందన వస్తోంది.

కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ను జనవరి 9న విడుదల చేసి, జనవరి 24న రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను విడుదల చేయనున్నారు. ఎన్ బి కె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ ,విబ్రి మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు