కేజిఎఫ్ 2 ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్ చేశారు.

Published on Dec 14, 2019 11:26 am IST

దేశవ్యాప్తంగా క్రేజీగా ఎదురుచూస్తున్న సినిమాలలో కే జి ఎఫ్ ఒకటి. గత ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈమూవీ ప్రభంజనం సృష్టించింది. పాన్ ఇండియాగా విడుదలైన ఈ చిత్రం అన్ని భాషలలో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో రాఖీ భాయ్ గా చేసిన హీరో యష్ ఒక్కసారిగా నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా ఈ మూవీకి సీక్వెల్ గా కేజీఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఈనెల 21న సాయంత్రం 5:45 కి విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక పోస్టర్ విడుదల చేసి తెలియజేశారు. అంతటి విజయం సాధించిన కేజిఎఫ్ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న కేజిఎఫ్ 2 చిత్రంలో రాఖీ భాయ్ లా యష్ లుక్ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి పెరిగిపోయింది. ఇక బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ కేజిఎఫ్ 2లో ప్రధాన విలన్ గా చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఆయన లుక్ విడుదల చేయడం జరిగింది. కేజిఎఫ్ సిరీస్ కి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More