తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ దసరా కానుకగా థియేటర్లలోకి రానుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ సాలిడ్ అప్డేట్ను మేకర్స్ రివీల్ చేశారు.
ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాగ్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ఈ ఫస్ట్ సింగిల్ సాంగ్‌తో మొదలుపెడుతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను ఆగస్టు 21న రిలీజ్ చేస్తున్నట్లు ఓ పవర్ఫుల్ పోస్టర్ ద్వారా వెల్లడించారు.
ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటంతో ఫస్ట్ పార్ట్ కంటే సెన్సేషన్ మ్యూజికల్ ట్రీట్ ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ‘జైలర్ 2’ నుంచి రాబోయే ఈ ఫస్ట్ సింగిల్ సాంగ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
The Feast is ready!🪘💥 #Jailer2 First Single releasing on August 21 🔥@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @vijaykartikdop @Nirmalcuts @ChethanDsouza @AlwaysJani @KiranDrk #PallaviSingh @valentino_suren #SantoshRaju @kabilanchelliah @RIAZtheboss #Jailer2FromOct15 pic.twitter.com/PKPNXvONXH
— Sun Pictures (@sunpictures) August 18, 2026


