ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సన్నద్ధం అవుతోన్న ‘మజిలీ’ !

Published on Mar 24, 2019 5:28 pm IST

నాగ చైతన్య సమంత హీరోహీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో రాబోతున్న మజిలీ చిత్రం ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కాబోతున్నది. ఇప్పటికే విడుదలైన ప్రోమోస్ టీజర్స్ మరియు ఆడియో జ్యూక్ బాక్స్ కూడా సినిమా పై అంచనాలను పెంచేశాయి. దీనికి తోడు చిత్రబృందం కూడా ప్రమోషన్స్ బాగా చేస్తోంది.

కాగా తాజాగా మజిలీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా సన్నద్ధం అవుతొంది. ఈ నెల 30వ తేదీన హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఎక్కడ జరుగుతుంది వేదిక ఎక్కడ లాంటి వివరాలు తెలియాల్సి ఉంది. పెళ్లి తరువాత సమంత, నాగ చైతన్య మొదటిసారి కలిసి నటిస్తోన్నారు. మరి మజిలీ వాళ్ళకి ఏ రేంజ్ హిట్ ఇస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం :