క్రేజీ..”సలార్” ఆగమనంకి ముహూర్తం ఖరారు.!

Published on May 26, 2023 8:34 pm IST

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో భారీ హైప్ ఉన్న సినిమా “సలార్” కూడా ఒకటి. మరి సెన్సేషన్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ పై మాసివ్ హైప్ ఉండగా ఈ సినిమా టీజర్ లేదా గ్లింప్స్ కోసం అయితే ఫ్యాన్స్ ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు.

మరి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మరో 1000 కోట్ల మార్కెట్ ఉన్న సినిమాగా ఇది తెరకెక్కుతుండగా ఇప్పుడు అయితే సలార్ అవైటెడ్ టీజర్ కోసం అయితే సాలిడ్ న్యూస్ ఒకటి బయటకి వచ్చింది. మేకర్స్ ఈ టీజర్ ని అనుకున్నట్టుగానే “ఆదిపురుష్” చిత్రంతో అయితే థియేట్రికల్ గా అటాచ్ చేసి రిలీజ్ చేయనున్నారట.

దీనితో అయితే ఈ జూన్ 16 న థియేటర్స్ లో రెండు బిగ్గెస్ట్ ట్రీట్స్ ఫ్యాన్స్ కి రాబోతున్నాయి అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందిస్తుండగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :