ఓటిటిలో “సలార్” ఇంగ్లీష్ వెర్షన్ డేట్ లాక్ అయ్యిందా?

ఓటిటిలో “సలార్” ఇంగ్లీష్ వెర్షన్ డేట్ లాక్ అయ్యిందా?

Published on Jan 20, 2024 9:41 AM IST

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బిగ్గెస్ట్ మాస్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” కోసం మరోసారి ఇప్పుడు ఇండియన్ ఆడియెన్స్ మాట్లాడుకుంటున్నారు. దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం ఈరోజు సౌత్ ఇండియా భాషల్లో రిలీజ్ కి రాగా మరోసారి ఈ మాస్ ఫీస్ట్ ని ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రం ఇంగ్లీష్ వెర్షన్ లో థియేట్రికల్ రిలీజ్ ఉంటుంది అని గతంలో బజ్ వచ్చింది.

కానీ ఇప్పుడు ఇది కేవలం ఓటిటి వరకే ఫిక్స్ అయ్యింది. మరి ఇంగ్లీష్ కూడా నెట్ ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ కి రానుండగా దీనిపై లేటెస్ట్ బజ్ తెలుస్తుంది. దీని ప్రకారం ఇంగ్లీష్ వెర్షన్ లో ఈ చిత్రం ఫిబ్రవరి 9 నుంచి అందుబాటులోకి రానున్నట్టుగా వినిపిస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా పృథ్వీ రాజ్ మరో ముఖ్య పాత్రలో నటించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు