సుధీర్ బాబు హీరోగా అమృతం సీరియల్ ఫేమ్ హర్షవర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మామా మశ్చీంద్ర. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు భారీగా నిర్మిస్తున్న ఈ మూవీకి సంగీతం చైతన్ భరద్వాజ్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరో సుధీర్ బాబు దుర్గ, పరశురామ్, డీజే అనే మూడు విభిన్న విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారు. కాగా ఇది తెలుగు, హిందీ భాషల్లో ద్విభాషా సినిమాగా రూపొందుతోంది.
ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించింది. విషయం ఏమిటంటే, ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ని ఏప్రిల్ 14 న విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం వెరైటీ గా ఒక వీడియో ద్వారా ప్రకటించారు. ఇందులో హీరో సుధీర్ బాబు, దర్శకుడు హర్షవర్ధన్ కలిసి టీజర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసారు. అలానే ఈ మూవీ టైటిల్ ని మామా మశ్చీంద్ర అని ఎందుకు పెట్టారో టీజర్ ని చూసి కనిపెట్టగలిగిన ఆడియన్స్ లో తొలి పదిమందికి మంచి బహుమతి కూడా ఇవ్వనునున్నట్లు వారు తెలిపారు.
