‘విజేత’ ఫస్ట్ లుక్ విడుదలకు కుదిరిన ముహుర్తం !

‘విజేత’ ఫస్ట్ లుక్ విడుదలకు కుదిరిన ముహుర్తం !

Published on May 25, 2018 4:30 PM IST

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమవుతూ చేస్తున్న చిత్రం ‘విజేత’. 1985లో విడుదలైన చిరంజీవిగారి సూపర్ హిట్ సినిమా ‘విజేత’ టైటిల్ తోనే వస్తున్న ఈ సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ రేపు మధ్యాహ్నం 3 గంటల 30 నిముషాలకు విడుదలకానుంది.

నూతన దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం బ్యానర్ నిర్మిస్తోంది. మంచి సామాజిక సందేశంతో రూపొందుతున్న ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ కు జోడీగా మాళవిక నాయర్ కథానాయకిగా నటిస్తోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సినిమాట్రోగ్రఫర్ సెంథిల్ కుమార్ కెమెరా వర్క్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు