ఏకంగా 6 సినిమాలతో పోటీపడనున్న దేవరకొండ

Published on Jul 23, 2019 8:43 am IST

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందాన కలిసి నటించిన “డియర్ కామ్రేడ్” ఈనెల 26 న గ్రాండ్ గా విడుదల కానుంది. సౌత్ లోని అన్ని ప్రధాన భాషలలో విడుదలవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అలాగే “డియర్ కామ్రేడ్” టీం సౌత్ ఇండియాలోని అన్ని ప్రధాన నగరాలలో మ్యూజిక్ ఫెస్టివల్స్ నిర్వహించి వినూత్న ప్రచారం కలిపించడం జరిగింది. కాగా “డియర్ కామ్రేడ్” తెలుగులో వచ్చే శుక్రవారం పోటీ ఏమి లేకుండా సోలోగా విడుదల అవుతుంది.

ఐతే తమిళంలో మాత్రం “డియర్ కామ్రేడ్”కి తీవ్ర పోటీ తప్పడం లేదు. అక్కడ ఏకంగా ఈ మూవీ ఆరు సినిమాలతో పోటీ పడనుంది.తమిళనాడులో జులై 26న “డియర్ కామ్రేడ్” తో కలుపుకొని మొత్తం 7 సినిమాలు విడుదల కానున్నాయి. వీటిలో తమిళంలో స్టార్ కమెడియన్ అయిన సంతానం నటించిన “ఏ1”, అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన “కొలైయుధిర్ కాలం” తో పాటు దర్శకుడు సముద్ర ఖని నటించిన “కొలాంజి”, అలాగే “నుంగంబాకం”,”చెన్నై పళని మార్స్”, “ఆరడి” అనే చిత్రాలు ఉన్నాయి. ఇలా మొత్తం ఆరు సినిమాలతో విజయ్ దేవరకొండ చిత్రం పోటీపడాల్సివస్తుంది. వీటిలో ఏ1,కొలైయుధిర్ కాలం మినహా మిగతావన్నీ చిన్న సినిమాలే కావడం “డియర్ కామ్రేడ్” కి కొంచెం ఊరటనిచ్చే అంశం.

మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తుండగా,జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. శృతి రామచంద్రన్,సుహాస్,చారు హాసన్,ఆనంద్ ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :