ఆ సన్నివేశాల్లో రష్మిక చాలా బాగా నటించిందట !

ఆ సన్నివేశాల్లో రష్మిక చాలా బాగా నటించిందట !

Published on Feb 25, 2019 11:14 PM IST

యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, క్రేజీ బ్యూటీ రష్మిక మండన్న రెండవ సారి జంటగా నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ చిత్రం ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కుతుంది. కాగా ఇటీవలే జరిగిన షెడ్యూల్ లో రష్మిక ఫై క్రికెట్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరించింది చిత్రబృందం. ఆ సన్నివేశాల్లో రష్మిక చాలా బాగా నటించిందని, ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ లానే ఆమె చాలా సహజంగా ఆడిందని చిత్రబృందం చెబుతుంది.

కాగా ఈ చిత్రంలో విజయ్ మెడికల్ స్టూడెంట్ గా కనిపించనున్నాడు. భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్నీ మైత్రీ మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా ప్రభాకర్ సంగీతం అందిస్తున్నారు. ఇక విజయ్ ప్రస్తుతం ఈ చిత్రంతోపాటు క్రాంతి మాధవ్ తెరక్కిస్తున్న కొత్త చిత్రంలో కూడా నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు