నాన్ స్టాప్ షూటింగ్ లో డియర్ కామ్రేడ్ !

నాన్ స్టాప్ షూటింగ్ లో డియర్ కామ్రేడ్ !

Published on Dec 10, 2018 8:28 PM IST


విజయ్ దేవరకొండ , రష్మిక మండన్న జంటగా నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ చిత్రం గత కొద్దీ రోజులుగా కాకినాడ లో నాన్ స్టాప్ గా చిత్రీకరణ జరుపుకుంటుంది. దాంతో ప్రస్తుతం 40 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యిందని సమాచారం. ప్రస్తుతం ఈ షెడ్యూల్ లో విజయ్ , రష్మిక ల ఫై కొన్ని ముఖ్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈచిత్రంలో రష్మిక క్రికెటర్ పాత్రలో నటిస్తుండగా విజయ్ ఈచిత్రంలో మెడికల్ స్టూడెంట్ గా కనిపించనున్నాడు.

నూతన దర్శకుడు భరత్ కమ్మ ఈచిత్రాన్ని చాలా రియలిస్టిక్ గా తెరకెక్కిస్తున్నాడట. సుజీత్ సారంగ్ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్థం లో విడుదలకానుంది. గీత గోవిందం తరువాత విజయ్ -రష్మిక కలిసి నటిస్తున్న ఈ చిత్రంఫై భారీ అంచనాలే వున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు