తుది దశకు చేరిన డియర్ కామ్రేడ్ షూటింగ్ !

Published on Mar 3, 2019 12:27 am IST

యంగ్ హీరో విజయ్ దేవరకొండ , కన్నడ బ్యూటీ రష్మిక మండన్నజంటగా నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ చిత్రం యొక్క చివరి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ కంప్లీట్ కానుంది. ఇక మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా రష్మిక , విజయ్ తమ పాత్రలకు డబ్బింగ్ చెప్తున్నారు. లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో నూతన దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో రష్మిక క్రికెటర్ పాత్రలో నటిస్తుండగా విజయ్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడు. జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 22 న విడుదలకానుందని సమాచారం. అయితే ఈ విడుదల తేదిపై అధికారిక ప్రకటన వెలుబడాల్సి వుంది.

సంబంధిత సమాచారం :