డియర్ కామ్రేడ్ టీజర్ విడుదల !

Published on Mar 17, 2019 11:23 am IST

గీత గోవిందం తరువాత విజయ్ దేవరకొండ , రష్మిక రెండవ సారి జంటగా నటిస్తున్న చిత్రం డియర్ కామ్రేడ్. ఈచిత్రం యొక్క టీజర్ ను కొద్దీ సేపటి క్రితం తెలుగు తోపాటు కన్నడ , మలయాల , తమిళ భాషల్లో విడుదలచేశారు. 68 సెకండ్ల నిడివి తో వచ్చిన ఈ టీజర్ లో రెబల్ స్టూడెంట్ గా విజయ్ ని పరిచయం చేస్తూ మరోవైపు తన లవర్ గా రష్మిక ను పరిచయం చేశారు. ఈ టీజర్ యూత్ కు బాగా నచ్చేలా వుంది.

భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుజీత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మే 31న ఈచిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More