‘డియర్ కామ్రేడ్’ ట్రైలర్ డేట్ ఫిక్స్ చేసిన విజయదేవరకొండ.

Published on Jul 9, 2019 3:02 pm IST

“గీత గోవిందం” మూవీతో తెలుగు ప్రేక్షకులను మాయచేసి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు సెన్సషనల్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ,బ్యూటీ రష్మిక మందాన. మరో మారు ఈ జంట “డియర్ కామ్రేడ్ చిత్రంతో అలరించనున్నారు.డైరెక్టర్ భరత్ కమ్మ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. శృతి రామచంద్రన్ మరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

ఐతే డియర్ కామ్రేడ్ మూవీ ట్రైలర్ ని ఈనెల 11న 11 గంటల 11నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ నేడు ఓ పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది. ఇంత వరకు డియర్ కామ్రేడ్ మూవీలో విజయ్ రోల్ ఏమిటనేది రివీల్ కాకపోవడంతో ప్రేక్షకులతో పాటు అభిమానులు ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More