డియర్ కామ్రేడ్ నుండి మరో అప్డేట్ రానుంది !

Published on May 2, 2019 12:56 pm IST

గీత గోవిందం తరువాత విజయ్ దేవరకొండ , రష్మిక రెండవ సారి జంటగా నటిస్తున్న చిత్రం డియర్ కామ్రేడ్. ఇటీవల ఈ చిత్రం యొక్క షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రం నుండి ఇటీవల టీజర్ , మెదటి సాంగ్ విడుదలకాగా విజయ్ బర్త్ డే సందర్భంగా ఈ నెల 9న మరో అప్డేట్ వెలువబడనుంది. బహుశా ఈచిత్రం నుండి సెకండ్ సాంగ్ కానీ లేదా న్యూ రిలీజ్ డేట్ ను కానీ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని తమిళ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అన్ని సౌత్ భాషల్లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More