పవన్ విషయంలో సినీ సెలబ్రిటీల వార్.. వేరే లెవల్లో ఉంది !

Published on Dec 2, 2020 3:00 am IST

గ్రేటర్ ఎన్నికలు రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల మధ్యనే కాదు రాజకీయాలతో టచ్ ఉన్న సినీ సెలబ్రిటీల మద్యన కూడ వాదోపవాదాలకు దారితీస్తున్నాయి. నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో పోటీ నుండి వైదొలగి జనసేన తరపున బీజేపీకి మద్దతు పలికారు. ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే నటుడు ప్రకాష్ రాజ్ సైతం బీజేపీ, జనసేన కూటమి మీద అసహనంగా మాట్లాడారు. దీంతో ఆయన సోదరుడు, జనసేన పార్టీ నేత ప్రకాష్ రాజ్ మీద నిప్పులు చెరిగారు. ప్రకాష్ రాజ్ రాజకీయ డొల్లతనం గురించి మాట్లాడుతూ ముందు మనిషిగా తయారై తర్వాత పవన్ ను విమర్శించు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దానికి ప్రకాష్ రాజ్ సైతం రియాక్ట్ అయ్యారు. గౌరవనీయులైన నాగబాబుగారికి, మీ తమ్ముడు మీద ఉన్న ప్రేమ నాకు అర్థం అయ్యింది. నాకు దేశం మీద ఉన్న ప్రేమని మీరు అర్థం చేసుకోండి. నాకు తెలుగు భాష వచ్చుకానీ మీ భాష రాదు అంటూ సమాధానం ఇచ్చారు. ఇంతలో నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కలుగజేసుకుని నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు రాజకీయాలతో సంబంధం లేదు కానీ పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం ఆయన వ్యక్తిత్వం ఆయన నిజాయితీ ఆయన నిబద్ధత నాకు తెలుసు.

పవన్ కళ్యాణ్ మహోన్నతమైన వ్యక్తి రాజకీయాలు ఎవరైనా చేసుకోవచ్చు రాజకీయాలు ఎవరైనా మాట్లాడుకోవచ్చు కాని వ్యక్తిత్వం గురించి పవన్ కళ్యాణ్ గురించి ఎవరు మాట్లాడినా నేను సహించను పవన్ కళ్యాణ్ నా దృష్టిలో నాకు ఎప్పటికీ దైవంతో సమానం. ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు ఎంతో మంది సాంకేతిక నిపుణులు ఎంతోమంది నిర్మాతల్ని పరిచయం చేసిన ఘనత మా దైవం పవన్ కళ్యాణ్. నిజాయితీకి నిలువుటద్దం పవన్ కళ్యాణ్. ఈరోజు నేను అనుభవిస్తున్న ఈ స్థాయి పవన్ కళ్యాణ్ పెట్టిన భిక్ష అంటూ ప్రకాష్ రాజ్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. బండ్ల చేసిన ఈ వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ ఎలాంటి సమాధానం ఇస్తారు, అవి ఎంత దూరం వెళుతాయో మరి.

సంబంధిత సమాచారం :

More