తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ బిజినెస్ జరుపుకున్న దేవ్ !

Published on Jan 31, 2019 10:55 am IST

తమిళ హీరో కార్తి గత ఏడాది ‘చినబాబు’ చిత్రంతో ప్రేక్షకులముందుకు వచ్చాడు. కోలీవుడ్ లో ఈచిత్రం బ్లాక్ బ్లాస్టర్ హిట్ అవ్వగా తెలుగులో యావరేజ్ అనిపించుకుంది. ఇక ఈ చిత్రం తరువాత కార్తి నటించిన తాజా చిత్రం ‘దేవ్’. ఈ చిత్రం ఫిబ్రవరి 14న తమిళం తోపాటు తెలుగులోనూ విడుదలకానుంది. ఈచిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఏపీ మరియు తెలంగాణ లో కలిపి ఈ చిత్రం 5.5 నుండి 6 కోట్ల వరకు బిజినెస్ చేసిందని సమాచారం.

నూతన దర్శకుడు రజత్ రవి శంకర్ తెరకెక్కించిన ఈచిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ చిత్రం యొక్క ట్రైలర్ ఈరోజు విడుదలకానుంది అలాగే ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను సన్ టీవీ దక్కించుకుంది. హారిస్ జైరాజ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు విడుదలచేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More