వేదికపై కన్నీరు పెట్టుకున్న దీపిక పదుకొనె..కారణం?

Published on Dec 11, 2019 1:43 am IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతరమయ్యారు. భావోద్వేగానికి గురైన ఆమెకు మాట్లాడటానికి కూడా కష్టపడ్డారు. అసలు విషయం ఏమిటంటే దీపిక యాసిడ్ దాడికి గురైన మాలతీ అనే ఒక అమ్మాయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నారు. చపాక్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి లేడీ డైరెక్టర్ మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించారు. ఫాక్స్ స్టూడియోస్, దీపికా పదుకొనె నిర్మాణ భాగస్వామ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం 2020జనవరి 11న విడుదల కానుంది.

కాగా నేడు చపాక్ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమంలో తాను చేసిన పాత్రను తలచుకొని దీపిక వేదిక పైనే కన్నీరు పెట్టుకున్నారు. ఇలాంటి సినిమాలలో నటించే అవకాశం అరుదుగా వస్తుందని ఆమె అన్నారు. ఈ పాత్రకు కొరకు నన్ను నమ్మి బాధ్యత అప్పగించిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞలు తెలిపారు. యాసిడ్ ఎటాక్ కారణంగా సర్వం కోల్పోయిన మాలతి జీవితంలో ఎలాంటి కష్టాలు అనుభవించినది, ఆమె మళ్ళీ తన నార్మల్ లైఫ్ ఎలా పొందగలిగింది అనే అంశాల ఆధారంగా చపాక్ మూవీ తెరకెక్కింది.

సంబంధిత సమాచారం :

More