ప్రభాస్ “ప్రాజెక్ట్ కే” పై దీపికా ఇంట్రెస్టింగ్ పోస్ట్.!

Published on Jul 24, 2021 6:09 pm IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో పాన్ వరల్డ్ స్థాయిలో ప్లాన్ చేస్తున్న సినిమా కూడా ఒకటి ఉంది. మరి దానినే ఈరోజు “ప్రాజెక్ట్ కే” గా మేకర్స్ స్టార్ట్ చెయ్యడంతో జాతీయ స్థాయిలో ఈ సినిమా పేరు ట్రెండ్ అయ్యింది. మరి ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్న నాగ్ అశ్విన్ సహా చిత్ర యూనిట్ అంతా ఇంకో వారం రోజులు పాటు బిజీ బిజీగా ఉండనున్నారు.

అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ అమితాబ్ మరియు దీపికా పదుకొనెలు కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ ప్రాజెక్ట్ పైనే దీపికా లేటెస్ట్ గా ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఒకటి పెట్టింది. “ఇది ప్రాజెక్ట్ – కే లో మొదటి రోజు, ముందు రాబోయే వాటి కోసం ఆలోచిస్తేనే చాలా థ్రిల్లింగ్ గా నాకు అనిపిస్తుంది”. అని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా దీపికా పోస్ట్ చేసింది. దీనితో మున్ముందు ఈ సినిమా నుంచి చాలానే సర్ప్రైజ్ ఎలిమెంట్స్ రావడం ఖాయం అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :