ఓటిటిలో వరల్డ్ వైడ్ హిట్ గా దీపికా పదుకొనె “గెహ్రియాన్”..!

ఓటిటిలో వరల్డ్ వైడ్ హిట్ గా దీపికా పదుకొనె “గెహ్రియాన్”..!

Published on Feb 20, 2022 2:00 PM IST


రీసెంట్ గా అనేక చిత్రాలు థియేటర్స్ సహా ఓటిటి లో కూడా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అలా డైరెక్ట్ గా ఓటిటి లో రిలీజ్ అయ్యిన లేటెస్ట్ చిత్రాల్లో బాలీవుడ్ దర్శకుడు షకూన్ బత్రా తెరకెక్కించిన చిత్రం “గెహ్రియాన్” కూడా ఒకటి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె మరియు యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేది మెయిన్ లీడ్స్ లో నటించిన ఈ చిత్రం..

రీసెంట్ గా ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో లో రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యింది. అయితే ఈ చిత్రం ఒక్క మన దేశంలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా హిట్ అయ్యినట్టుగా సినీ వర్గాలు మరియు ప్రైమ్ వీడియో వారు చెబుతున్నారు. మన దేశంతో పాటుగా రష్యా, సింగపూర్ మరియు యూఎస్ఏ సహా యునైటెడ్ కింగ్ డమ్ లో ఈ చిత్రం టాప్ 1 నుంచి టాప్ 5 ట్రెండ్ అవుతూ గ్లోబల్ హిట్ గా నిలిచింది. దీనితో దీపికా కూడా దీనిని తన ఇన్స్టా స్టోరీ లో షేర్ చేసుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు