చివరి నిమిషంలో వాయిదా పడ్డ ‘దీవాన’.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!

చివరి నిమిషంలో వాయిదా పడ్డ ‘దీవాన’.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!

Published on Jun 18, 2026 11:02 AM IST

యంగ్ హీరో హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేగలై జంటగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా ‘దీవాన’ జూన్ 19న గ్రాండ్ రిలీజ్ డేట్‌కు రెడీ అయింది. అయితే, రిలీజ్‌కు ఒక్క రోజు ముందు ఈ సినిమా వాయిదా పడింది. ముందుగా ప్రకటించినట్లుగా ఈ చిత్రం జూన్ 19న థియేటర్లలోకి రావడం లేదు.

సెన్సార్ పనులు పూర్తి కాకపోవడంతో మేకర్స్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, గత రెండు రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలు విజయవంతంగా ప్రదర్శితమవుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంతేగాక జూన్ 19న ఈ చిత్ర పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయని వారు వెల్లడించారు.

శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తుండటం విశేషం. వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఈశ్వర్ చంద్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు.

తాజా వార్తలు