రామ్ ‘రెడ్’ కూడా ‘మే’లోనేనా ?

రామ్ ‘రెడ్’ కూడా ‘మే’లోనేనా ?

Published on Apr 3, 2020 10:00 PM IST

సెన్సేషనల్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘ఇస్మార్ట్ శంకర్‌’ తర్వాత రామ్‌ హీరోగా చేస్తున్న సినిమా ‘రెడ్’. కాగా ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్ సెకెండ్ వీక్ లో విడుదల చేయాలనుకున్నారు, కానీ కరోనా దెబ్బకు పోస్ట్ ఫోన్ అయింది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని మే సెకెండ్ వీక్ లో విడుదల చేయాలని మేకర్స్ యోచిస్తున్నారట. మొత్తానికి కరోనా సినిమాలకు కూడా బాగానే నష్టం చేస్తోంది.

ఇక ఈ సినిమాలో బ్యూటీ హెబ్బా పటేల్ సెకెండ్ హాఫ్ లో వచ్చే ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. తిరుమల కిషోర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ సరసన నివేదా పేతురాజ్ , మాళవిక శర్మ , అమృతా అయ్యర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా సమీర్‌ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు